ఐపీఎల్‌కు పాండ్యా దూరం?
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:24 AM
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమవుతాడన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చీలమండ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని...
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమవుతాడన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చీలమండ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచారం. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా దూరమయ్యాడు. అయితే, జనవరిలో అప్ఘానిస్థాన్‌తో జరిగే పొట్టి సిరీస్‌కైనా కోలుకొంటాడని ఆశించినా. అదీ కష్టమేనట. అదే జరిగే ఐపీఎల్‌లో కూడా ఆడే అవకాశాలు లేవని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్ కోసం హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని బీసీసీఐ కోరుకొంటోంది. ఈ నేపథ్యంలో అతడి విషయంలో రిస్క్ తీసుకోవడానికి బోర్డు సిద్ధం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యాను ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.