పోప్‌ డబుల్‌ సెంచరీ; ఇంగ్లండ్‌ 524/4 డిక్లేర్‌

ABN , First Publish Date - 2023-06-03T01:03:59+05:30 IST

ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఒల్లీ పోప్‌ (205) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

పోప్‌ డబుల్‌ సెంచరీ; ఇంగ్లండ్‌ 524/4 డిక్లేర్‌

లార్డ్స్‌: ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఒల్లీ పోప్‌ (205) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అలాగే ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (182) సైతం భారీ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 524 వద్ద డిక్లేర్‌ చేసింది. కాగా ఇంగ్లండ్‌ తరఫున వేగంగా (232 ఇన్నింగ్స్‌) 11వేల రన్స్‌చేసిన ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఐర్లాండ్‌ రెండో రోజు ఆటచివరికి 97/3 స్కోరుతో నిలిచింది. కాగా ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది.

Updated Date - 2023-06-03T01:03:59+05:30 IST