Share News

వన్డే సిరీస్‌ విండీస్‌ వశం

ABN , First Publish Date - 2023-12-11T04:38:34+05:30 IST

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య వెస్టిండీస్‌ 2-1తో సొంతం చేసుకొంది. శనివారం రాత్రి జరిగిన సిరీస్‌ నిర్ణాయక మూడో వన్డేలో విండీస్‌ 4 వికెట్లతో...

వన్డే సిరీస్‌ విండీస్‌ వశం

బ్రిడ్జ్‌టౌన్‌: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య వెస్టిండీస్‌ 2-1తో సొంతం చేసుకొంది. శనివారం రాత్రి జరిగిన సిరీస్‌ నిర్ణాయక మూడో వన్డేలో విండీస్‌ 4 వికెట్లతో (డ/లూ పద్ధతి) ఇంగ్లండ్‌పై నెగ్గింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్‌ 9 వికెట్లకు 206 పరుగులు చేసింది. అయితే, విండీస్‌ ఛేదనకు ముందు వరుణుడు మరోసారి అడ్డుపడడంతో డక్‌వర్త్‌/లూయిస్‌ పద్ధతిన లక్ష్యాన్ని 34 ఓవర్లలో 188 పరుగులుగా నిర్దేశించారు. దీన్ని విండీస్‌ 31.4 ఓవర్లలో 191/6 స్కోరు చేసి ఛేదించింది. తొలి వన్డేలో విండీస్‌ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచింది.

Updated Date - 2023-12-11T07:33:31+05:30 IST