Novak Djokovic : జొకో.. జోరు

ABN , First Publish Date - 2023-06-07T06:15:01+05:30 IST

హాట్‌ ఫేవరెట్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. జొకోతోపాటు మహిళల రెండో సీడ్‌ అరియానా సబలెంక, చెక్‌ రిపబ్లిక్‌ సంచలన తార కరోలినా ముచోవా తుది నలుగురి

Novak Djokovic : జొకో.. జోరు

• సెమీస్‌కు సెర్బియా స్టార్‌

• సబలెంక, ముచోవా కూడా

• ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: హాట్‌ ఫేవరెట్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. జొకోతోపాటు మహిళల రెండో సీడ్‌ అరియానా సబలెంక, చెక్‌ రిపబ్లిక్‌ సంచలన తార కరోలినా ముచోవా తుది నలుగురి జాబితాలో చోటు ఖాయం చేసుకున్నారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ పోరులో మూడో సీడ్‌ జొకోవిచ్‌ 4–6, 7–6(0), 6–2, 64తో రష్యాకు చెందిన 11వ సీడ్‌ కారెన్‌ కచనోవ్‌పై కష్టపడి నెగ్గాడు. ఇక నాలుగో రౌండ్‌ పోరులో అర్జెంటీనా అన్‌సీడెడ్‌ ఆటగాడు టోమాస్‌ మార్టిన్‌ ఎట్చ్‌వరీ 7–6(8), 6–0, 6–1తో 27వ సీడ్‌ నిషియోక (జపాన్‌)ను కంగుతినిపించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ముచోవా 7–5, 6–2తో మాజీ రన్నరప్‌ ప్యావలుచెన్‌కొవా (రష్యా)పై వరుస సెట్లలో నెగ్గి తొలిసారి ఇక్కడ సెమీస్‌ చేరింది. మరో మ్యాచ్‌లో సబలెంక 6–4, 6–4తో స్విటోలినాపై అలవోకగా గెలిచి ముచోవాతో సెమీస్‌ పోరుకు సిద్ధమైంది. అయితే, మ్యాచ్‌ ముగిసిన తర్వాత బెలారస్‌ ప్లేయర్‌ సబలెంకాకు ఉక్రెయిన్‌ స్టార్‌ స్విటోలినా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రేక్షకులు ఆమెను గేలి చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు బెలారస్‌ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా రష్యా, బెలారస్‌ క్రీడాకారులతో చేయి కలిపేందుకు కూడా ఉక్రెయిన్‌ క్రీడాకారులు ఆసక్తి చూపడం లేదు.

Updated Date - 2023-06-07T06:33:49+05:30 IST