హాకీలో అమ్మాయిలకు తొమ్మిదో స్థానం
ABN , First Publish Date - 2023-12-11T04:28:38+05:30 IST
జూనియర్ మహిళల హాకీ వరల్డ్‌క్‌పలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆదివారం అమెరికాతో హోరాహోరీగా జరిగిన వర్గీకరణ...
సాంటియాగో: జూనియర్ మహిళల హాకీ వరల్డ్‌క్‌పలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆదివారం అమెరికాతో హోరాహోరీగా జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో 3-2 తేడాతో సడెన్ డెత్ ద్వారా గెలిచింది. గోల్‌కీపర్ మాధురి కిండో విశేషంగా రాణించి విజయంలో కీలకంగా నిలిచింది. నిర్ణీత 60 నిమిషాల్లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఇక ఫలితం కోసం షూటవుట్ అనివార్యం కాగా.. ఇందులో ఐదు అవకాశాల్లో మూడింట్లో భారత్ సఫలమైంది. అటు ప్రత్యర్థి మూడు గోల్స్ ప్రయత్నాలను కీపర్ కిండో అడ్డుకోవడంతో భారత్ సంబరాల్లో మునిగింది.