Neetu Ganghas: ప్రీక్వార్టర్స్‌కు నీతు
ABN , First Publish Date - 2023-03-19T00:46:49+05:30 IST
మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. మరో ముగ్గురు నీతూ ఘంఘాస్, ప్రీతి, మంజు బంబోరియా ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు.

ప్రీతి, మంజు కూడా
ప్రపంచ బాక్సింగ్
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. మరో ముగ్గురు నీతూ ఘంఘాస్, ప్రీతి, మంజు బంబోరియా ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. శనివారం జరిగిన రౌండ్-32లో 48 కిలోల విభాగంలో డోయన్ కాంగ్ (కొరియా)ను కామన్వెల్త్ చాంపియన్ నీతూ నాకౌట్ చేసింది. తొలి రౌండ్‌లోనే నీతూ పంచ్‌లకు డోయన్ నిలువలేక పోయింది. కౌంటింగ్ ఇచ్చిన రెఫరీ.. ఆర్‌ఎస్‌సీ (రెఫరీ స్టాప్ట్ కాంటెస్ట్) కింద ఘంఘా్‌సను విజేతగా ప్రకటించారు. 54 కిలోల కేటగిరీలో ప్రీతి 4-3తో లక్రమియోర పెరిజోక్ (రొమేనియా)పై, 66 కిలోల్లో మంజు 5-0తో కారా (న్యూజిలాండ్)పై గెలిచి ముందంజ వేశారు.