జాతీయ చెస్ చాంపియన్ శ్రీరామ్
ABN , First Publish Date - 2023-12-11T04:48:14+05:30 IST
జాతీయ చెస్ చాంపియన్‌షిప్ బాలుర అండర్-13 విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు ఆదర్శ్ శ్రీరామ్ విజేతగా నిలిచాడు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ చెస్ చాంపియన్‌షిప్ బాలుర అండర్-13 విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు ఆదర్శ్ శ్రీరామ్ విజేతగా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో శ్రీరామ్ 9.5 పాయింట్లతో టైటిల్ కైవసం చేసుకోగా, వీరేశ్ (మహారాష్ట్ర) రన్నరప్‌గా నిలిచాడు. బాలికల్లో శ్రియ(మహారాష్ట్ర) విజేతగా నిలవగా, షణ్మతిశ్రీ(తమిళనాడు) రన్నర్‌పతో సరిపెట్టుకుంది. భారత చెస్ సమాఖ్య కార్యదర్శి భరత్ సింగ్, రాష్ట్ర చెస్ సంఘం చీఫ్ కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.