Muchova: క్వార్టర్స్‌కు ముచోవా

ABN , First Publish Date - 2023-09-04T02:32:00+05:30 IST

జోరుమీదున్న చెక్‌ భామ కరోలినా ముచోవా యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కాగా, పురుషుల డిఫెండింగ్‌ చాంప్‌ కార్లోస్‌ అల్కరాస్‌, మూడో సీడ్‌ మెద్వెదెవ్‌, లోకల్‌ స్టార్‌ జెస్సికా పెగుల ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

Muchova: క్వార్టర్స్‌కు ముచోవా

రౌండ్‌-16కు అల్కరాస్‌, మెద్వెదెవ్‌

యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: జోరుమీదున్న చెక్‌ భామ కరోలినా ముచోవా యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కాగా, పురుషుల డిఫెండింగ్‌ చాంప్‌ కార్లోస్‌ అల్కరాస్‌, మూడో సీడ్‌ మెద్వెదెవ్‌, లోకల్‌ స్టార్‌ జెస్సికా పెగుల ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌ పోరులో 10వ సీడ్‌ ముచోవా 6-3, 5-7, 6-1తో వాంగ్‌ గ్జిన్‌యు (చైనా)పై గెలిచింది. ఇక, మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ పెగుల 6-4, 4-6, 6-2తో స్విటోలినాను, 5వ సీడ్‌ జెబ్యూర్‌ 5-7, 7-6(5), 6-3తో మరియా బుజ్‌కొవాను, 9వ సీడ్‌ వొండ్రుసోవా 6-2, 6-1తో అలెగ్జాండ్రొవాను, 17వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ 5-7, 6-2, 6-2తో సంపొనొవాను ఓడించి ప్రీక్వార్టర్స్‌ చేరారు.

అల్కరాస్‌ జోరు:

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ అల్కరాజ్‌ 6-2, 6-3, 4-6, 6-3తో డాన్‌ ఇనాన్స్‌పై నెగ్గాడు. మెద్వెదెవ్‌ 6-2, 6-2, 7-6(6)తో సెబాస్టియన్‌ బేజ్‌పై, 6వ సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ 6-3, 2-6, 6-4, 6-2తో వావ్రింకాపై, 8వ సీడ్‌ రుబ్లేవ్‌ 3-6, 6-3, 6-1, 7-5తో ఆర్థర్‌ కిండర్‌కెంచ్‌పై, 12వ సీడ్‌ జ్వెరెవ్‌ 6-7(2), 7-6(8), 6-1, 6-1తో దిమిత్రోవ్‌పై విజయం సాధించారు.

క్వార్టర్స్‌లో బోపన్న జోడీ:

భారత ఆటగాడు రోహన్‌ బోపన్న పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. రౌండ్‌-16లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జంట 6-4, 6-7(5), 7-6(6)తో బ్రిటన్‌కు చెందిన జూలియన్‌ క్యాష్‌-హెన్రీ ప్యాటర్న్‌ జోడీపై గెలిచింది.

Updated Date - 2023-09-04T02:32:06+05:30 IST