Meghana : మేఘన బృందానికి పసిడి
ABN , First Publish Date - 2023-06-07T06:10:25+05:30 IST
ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్‌కప్‌లో తెలంగాణ యువ షూటర్ సదుల మేఘన బృందం పసిడి పతకం కొల్లగొట్టింది. మంగళవారం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్‌కప్‌లో తెలంగాణ యువ షూటర్ సదుల మేఘన బృందం పసిడి పతకం కొల్లగొట్టింది. మంగళవారం జర్మనీలోని సుహ్ల్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మేఘన, ఖత్రి పాయల్, సిమ్రన్‌ప్రీత్ కౌర్ బృందం 1719 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ స్వర్ణం నెగ్గాడు.
సురభికి స్వర్ణం: జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి రాపోలు సురభి భరద్వాజ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఈ పోటీల్లోని మహిళల 50 మీటర్ల 3పీ ఈవెంట్ ఫైనల్‌లో సురభి 458 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.