‘హ్యాండ్‌బాల్’ విజేత మహారాష్ట్ర
ABN , First Publish Date - 2023-06-26T01:02:32+05:30 IST
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి టైటిల్‌ను మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టు సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి టైటిల్‌ను మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టు సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర 38-24తో గోల్డెన్ ఈగిల్ యూపీ మెన్‌ను చిత్తు చేసింది. ఫస్టాఫ్‌లో 16-13తో పైచేయి సాధించిన మహారాష్ట్ర.. సెకండా్‌ఫలో 22-11తో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జలాల్ కియాని, ఇగోలర్ చిసిలోవ్ చెరో 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలపాత్ర పోషించారు.