ఫైనల్లో కృష్ణప్రసాద్ జోడీ
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:34 AM
ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్‌లో తెలుగు షట్లర్ కృష్ణప్రసాద్-సాయిప్రతీక్ జోడీ ఫైనల్ చేరింది.
కటక్: ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్‌లో తెలుగు షట్లర్ కృష్ణప్రసాద్-సాయిప్రతీక్ జోడీ ఫైనల్ చేరింది. సెమీ్‌సలో కృష్ణప్రసాద్ ద్వయం 21-17, 17-21, 21-18తో సత్రియాజి-క్రిస్టోఫర్ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-తనీషా జంట 21-17, 21-13తో అరియా-రహాయు (ఇండోనేసియా) జోడీని ఓడించి ఫైనల్లో ప్రవేశించింది.