Jyoti Surekha: భారత జట్టులో జ్యోతి సురేఖ

ABN , First Publish Date - 2023-02-21T03:21:57+05:30 IST

కాంపౌండ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖకు భారత ఆర్చరీ జట్టులో చోటుదక్కింది. ఆసియా క్రీడలు, వరల్డ్‌కప్‌, ప్రపంచ ...

Jyoti Surekha: భారత జట్టులో జ్యోతి సురేఖ

టాప్‌-8లో చికీత జూ ట్రయల్స్‌లో దీపిక విఫలం

సోనిపట్‌: కాంపౌండ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖకు భారత ఆర్చరీ జట్టులో చోటుదక్కింది. ఆసియా క్రీడలు, వరల్డ్‌కప్‌, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ కోసం సోమవారం ముగిసిన ఆఖరి లెగ్‌ ఆర్చరీ ట్రయల్స్‌లో సురేఖ టాప్‌-4లో నిలిచి చాన్స్‌ పట్టేసింది. పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు తరఫున సురేఖ ఆడుతోంది. తెలంగాణకు చెందిన తనిపర్తి చికీతకు టాప్‌-8లో చోటు దక్కింది. వీరందరూ జాతీయ క్యాంప్‌నకు ఎంపికైనా టాప్‌-4లో నిలిచిన ఆర్చర్లకు భారత జట్టులో చోటు ఖాయం కాగా.. వారు విఫలమైతే 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లకు అవకాశం లభించొచ్చు. ఇక మాజీ వరల్డ్‌ నెం:1 దీపికా కుమారి ట్రయల్స్‌లో విఫలం కావడంతో జట్టులో చోటు లభించలేదు. కాగా, ఆమె భర్త అతాను దాస్‌ మాత్రం భారత టీమ్‌లోకి పునరాగమనం చేశాడు. అయితే, వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ కోసం నిర్వహించే ట్రయల్స్‌లో దీపిక పాల్గొని సత్తాచాటితే మరో చాన్స్‌ లభించొచ్చు.

భారత కాంపౌండ్‌ (మహిళలు) జట్టు: అవనీత్‌ కౌర్‌ (పంజాబ్‌), వెన్నం జ్యోతి సురేఖ (పీఎస్‌పీబీ), అదితి స్వామి (మహారాష్ట్ర), సాక్షి చౌదరి (యూపీ), ప్రగతి (ఢిల్లీ), రాగిణి మార్కో (ఎంపీ), ప్రణీత్‌ కౌర్‌ (పంజాబ్‌), తనిపర్తి చికీత (తెలంగాణ).

Updated Date - 2023-02-21T03:21:58+05:30 IST