Jocko: విశ్రాంతి కోరుతున్న జొకో
ABN , First Publish Date - 2023-07-25T02:17:26+05:30 IST
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వచ్చే నెల ఆరంభంలో జరిగే నేషనల్ బ్యాంక్ ఓపెన్ (టొరంటో మాస్టర్స్) నుంచి వైదొలిగాడు.
టొరంటో మాస్టర్స్ ఆడలేనన్న నొవాక్
టొరంటో: సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వచ్చే నెల ఆరంభంలో జరిగే నేషనల్ బ్యాంక్ ఓపెన్ (టొరంటో మాస్టర్స్) నుంచి వైదొలిగాడు. వింబుల్డన్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓడిన నొవాక్, తాను అలసి పోయానని.. కొంత విశ్రాంతి కావాలనుకొంటున్నానని చెప్పాడు. కాగా, అల్కరాస్ చేతిలో ఓటమి నొవాక్‌ను బాధిస్తోందనేది అతడి మాటలను బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అతడు యూఎస్ ఓపెన్ బరిలోకి దిగడంకూడా సందేహమేనని అంటున్నారు.