Jadeja : రెండో టెస్టుకు జడేజా రెడీ!
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:38 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టుకు వెన్ను నొప్పి కారణంగా దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోలుకున్నట్టు సమాచారం. దీంతో వచ్చే నెల 3 నుంచి జరిగే రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
షమి స్థానంలో అవేశ్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టుకు వెన్ను నొప్పి కారణంగా దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోలుకున్నట్టు సమాచారం. దీంతో వచ్చే నెల 3 నుంచి జరిగే రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జడ్డూ సాధన ప్రారంభించినట్టు జట్టు వర్గాలు తెలిపాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిశాక మిగతా ఆటగాళ్లతో కలిసి జడేజా మైదానంలో కనిపించాడు. అలాగే ప్రాక్టీ్‌సలోనూ పెద్దగా ఇబ్బందిపడలేదు. జట్టు కండిషనింగ్ కోచ్ రజనీకాంత్ పర్యవేక్షణలో దాదాపు 20 నిమిషాలపాటు నెట్స్‌లో పాల్గొని పేసర్ ముకేశ్‌తో కలిసి బౌలింగ్ చేశాడు. తొలి టెస్టులో జడేజా స్థానంలో ఆడిన అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయాడు.
గాయంతో టెస్టు సిరీ్‌సకు దూరమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమి స్థానంలో అవేశ్ ఖాన్‌కు పిలుపు అందింది. అవేశ్ ప్రస్తుతం భారత‘ఎ’ జట్టు తరఫున దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. రెండో టెస్టు కోసం అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టులో పేసర్లు తేలిపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రసిద్ధ్, శార్దూల్ దారుణంగా నిరాశపర్చగా బుమ్రాకు మరో ఎండ్ నుంచి సహకారమే అందలేదు. ఇప్పటికే అవేశ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీ్‌సలలో ఆడాడు.
రోహిత్ సేనకు రెండు పాయింట్ల కోత
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమితో భారత్‌కు గట్టి దెబ్బే తగిలింది. ఈ మ్యాచ్‌కు ముందు జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉంది. కానీ ఇన్నింగ్స్ ఓటమితో పాటు స్లోఓవర్ రేటుకు పాల్పడినందుకు 10 శాతం జరిమానా, రెండు డబ్ల్యూటీసీ పాయింట్ల కోత పడింది. దీంతో జట్టు ఏకంగా టాప్ నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.