Share News

Ishan Kishan : టెస్టు సిరీస్‌ నుంచి ఇషాన్‌ అవుట్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:59 AM

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సకు ముందు భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ షమి దూరమవగా.. తాజాగా వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా టెస్టు సిరీస్‌ నుంచి

 Ishan Kishan : టెస్టు సిరీస్‌ నుంచి ఇషాన్‌ అవుట్‌

భరత్‌కు చోటు

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సకు ముందు భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ షమి దూరమవగా.. తాజాగా వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా టెస్టు సిరీస్‌ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల రీత్యా టెస్టు సిరీస్‌ నుంచి తనను తప్పించాలని స్వయంగా ఇషానే కోరాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అతని స్థానంలో తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌కు జట్టులో చోటు కల్పించినట్టు బోర్డు ప్రకటించింది. భరత్‌ త్వరలోనే జట్టుతో చేరనున్నట్టు వెల్లడించింది. ఈనెల 26 నుంచి టెస్టు సిరీస్‌ మొదలవనుంది.

Updated Date - Dec 18 , 2023 | 04:08 AM