Isha : షూటింగ్ వరల్డ్‌కప్‌కు ఇషా అర్హత
ABN , First Publish Date - 2023-01-15T00:57:09+05:30 IST
హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ సీనియర్ షూటింగ్ వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ సీనియర్ షూటింగ్ వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా 581 స్కోరుతో స్వర్ణం గెలిచింది. దీంతో ఫిబ్రవరిలో ఈజిప్టు, మార్చిలో భోపాల్ వేదికలుగా జరిగే వరల్డ్‌కప్ ఈవెంట్లలో తలపడేందుకు అర్హత సాధించింది.