ముగింపు వేడుకల్లో రాక్‌ అండ్‌ రోల్‌

ABN , First Publish Date - 2023-05-27T03:45:50+05:30 IST

ఐపీఎల్‌ ముగింపు వేడుకల్లోనూ తారలు సందడి చేయనున్నారు.

ముగింపు వేడుకల్లో రాక్‌ అండ్‌ రోల్‌

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ముగింపు వేడుకల్లోనూ తారలు సందడి చేయనున్నారు. ఆదివారం జరిగే మెగా ఫైనల్‌కు ముందు సాయంత్రం 6 గంటలకు ప్రముఖ ర్యాపర్‌ న్యూక్లియా, సింగర్‌ కింగ్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌, మ్యూజిక్‌ మ్యాస్ట్రో రెహమాన్‌ కూడా వేడుకల్లో మెరవనున్నారని తెలుస్తోంది. ఇక, మ్యాచ్‌ మధ్యలో ఒక ఇన్నింగ్స్‌ ముగిశాక ప్రముఖ సింగర్‌ జోనితా గాంధీ, ర్యాపర్‌ డివైన్‌ సందడి చేయనున్నారు.

Updated Date - 2023-05-27T03:45:50+05:30 IST