కజకిస్థాన్‌పై భారత్ గెలుపు
ABN , First Publish Date - 2023-02-15T03:22:53+05:30 IST
ఏస్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌ల అలవోక విజయాలతో.. ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌ను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్-బిలో
దుబాయ్: ఏస్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌ల అలవోక విజయాలతో.. ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌ను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్-బిలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసింది. సింగిల్స్‌లో సింధు 21-4, 21-12తో కమిల స్మగులొవాపై, ప్రణయ్ 21-9, 21-11తో దిమిత్రి పనరిన్‌పై నెగ్గగా డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్దన్, ట్రీసా జాలీ-గాయత్రి పుల్లెలతోపాటు మిక్స్‌డ్‌లో ఇషాన్ భట్నాగర్-తనీష క్రాస్టో జోడీలు విజయాలు సాధించాయి.