హాకీలో టాప్‌-3కి భారత్‌

ABN , First Publish Date - 2023-09-20T04:35:01+05:30 IST

భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. తాజా ఎఫ్‌ఐహెచ్‌ ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపరచుకున్న భారత్‌..

హాకీలో టాప్‌-3కి భారత్‌

లుసాన్నె (స్విట్జర్లాండ్‌): భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. తాజా ఎఫ్‌ఐహెచ్‌ ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపరచుకున్న భారత్‌.. మూడో ర్యాంక్‌లో నిలిచింది. గతనెల చెన్నైలో జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకపోవడంతో భారత్‌ మొత్తం 2771 పాయింట్లతో టాప్‌-3లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌ (3113) టాప్‌లో ఉండగా, బెల్జియం (2989) రెండు, ఇంగ్లండ్‌ (2745) నాలుగు, జర్మనీ (2689) ఐదు, ఆస్ట్రేలియా (2544) ఆరు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. మహిళల విభాగంలో భారత జట్టు ఓ స్థానం ఎగబాకి 2325 పాయింట్లతో 7వ ర్యాంకులో నిలిచింది. నెదర్లాండ్స్‌ అగ్రస్థానంలో.. ఆస్ట్రేలియా, అర్జెంటీనా వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి.

Updated Date - 2023-09-20T04:35:01+05:30 IST