Nishika : జిమ్నాస్టిక్స్‌లో నిషికకు స్వర్ణం
ABN , First Publish Date - 2023-08-22T03:06:26+05:30 IST
ఫారోస్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ కప్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫారోస్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ కప్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈజిప్టులో జరిగిన ఈ పోటీల్లో బాలికల అండర్-16లో వాల్ట్ టేబుల్ విభాగంలో నిషిక అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ జిమ్నాస్ట్ బుద్దా అరుణరెడ్డితో కలిసి గాడియం అకాడమీలో మనోజ్ శిక్షణలో నిషిక సాధన చేస్తోంది.