ICC ODI Rankings: టాప్‌ లేపిన సిరాజ్‌

ABN , First Publish Date - 2023-01-26T00:19:55+05:30 IST

శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీ్‌సలలో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు

ICC ODI Rankings: టాప్‌ లేపిన సిరాజ్‌

దుబాయ్‌: శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీ్‌సలలో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన జాబితాలో సిరాజ్‌ మొత్తం 729 పాయింట్లతో.. హేజిల్‌వుడ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ను వెనక్కునెట్టి నెం:1 ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు. మరో టీమిండియా పేసర్‌ షమి 32వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక, బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆరో ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ 8వ ర్యాంక్‌లో నిలిచారు. కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు.

Updated Date - 2023-01-26T08:19:10+05:30 IST