ఆ ఫోన్‌ కాల్‌తో చెన్నైతోనే ఉండిపోయా..

ABN , First Publish Date - 2023-06-02T03:54:55+05:30 IST

దశాబ్ద కాలంపాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కొనసాగిన మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రిటైర్మెంట్‌ తర్వాత కూడా జట్టుతో పాటే ఉండడం వెనుక కారణం తెలిపాడు.

ఆ ఫోన్‌ కాల్‌తో చెన్నైతోనే ఉండిపోయా..

న్యూఢిల్లీ: దశాబ్ద కాలంపాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కొనసాగిన మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రిటైర్మెంట్‌ తర్వాత కూడా జట్టుతో పాటే ఉండడం వెనుక కారణం తెలిపాడు. ఈ సీజన్‌లో బ్రావో సీఎ్‌సకే బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఈ కొత్త పాత్ర వెనుక ఎంఎస్‌ ధోనీ, కోచ్‌ ఫ్లెమింగ్‌ ఉన్నారని తెలిపాడు. ‘ఐపీఎల్‌లో విజయవంతమైన కెరీర్‌కు గతేడాది ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత కూడా సహాయకపాత్రలో అదే జట్టుతో కొనసాగాలని రాసిపెట్టుందేమో. రిటైర్మెంట్‌ ప్రకటించాక ధోనీ, ఫ్లెమింగ్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నా’ అని బ్రావో వివరించాడు. చెన్నై తరఫున 144 మ్యాచ్‌లు ఆడిన ఈ విండీస్‌ మాజీ ప్లేయర్‌ 168 వికెట్లు పడగొట్టాడు. 2011, 2018, 2021 టైటిల్‌ విజయాల్లో పాలుపంచుకున్నాడు.

Updated Date - 2023-06-02T04:05:31+05:30 IST