Husam: క్వార్టర్స్‌లో హుసామ్‌

ABN , First Publish Date - 2023-02-24T01:02:18+05:30 IST

రెండుసార్లు కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.

Husam: క్వార్టర్స్‌లో హుసామ్‌

స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌

సోఫియా (బల్గేరియా) : రెండుసార్లు కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన 57 కిలోల రౌండ్‌-16 పోరులో తెలంగాణకు చెందిన హుసాముద్దీన్‌ 4-1 స్కోరుతో మిచెల్లీ బల్డాసీ (ఇటలీ)ని చిత్తు చేశాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ఆర్మేనియా బాక్సర్‌ బజేయన్‌ ఆర్టుర్‌తో హుసామ్‌ తలపడతాడు. ఇక 51 కి. విభాగం ప్రీక్వార్టర్‌ఫైనల్లో భారత్‌కు చెందిన బిశ్వామిత్ర చోంగ్తమ్‌ 5-0తో కెంజే మురాతలీ (కజకిస్థాన్‌)పై ఘన విజయం సాధించాడు. తదుపరి రౌండ్‌లో రోచ్‌ జోర్డాన్‌ (అమెరికా)తో చోంగ్తమ్‌ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో రౌండ్‌-16 మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌ సంజీత్‌ (92కి.) అమెరికాకు చెందిన టాలీ జామర్‌ చేతిలో ఓడిపోయాడు.

Updated Date - 2023-02-24T01:02:19+05:30 IST