Hockey World Cup : భారత్‌ చేతిలో జపాన్‌ చిత్తు

ABN , First Publish Date - 2023-01-27T03:23:33+05:30 IST

హాకీ వరల్డ్‌కప్‌ టైటిల్‌ పోటీ నుంచి ఇప్పటికే అవుటైన భారత జట్టు.. ఎట్టకేలకు జూలు విదిల్చింది. గురువారం జరిగిన 9-16 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 8-0తో జపాన్‌ను చి

Hockey World Cup : భారత్‌ చేతిలో జపాన్‌ చిత్తు

హాకీ వరల్డ్‌కప్‌

రూర్కెలా: హాకీ వరల్డ్‌కప్‌ టైటిల్‌ పోటీ నుంచి ఇప్పటికే అవుటైన భారత జట్టు.. ఎట్టకేలకు జూలు విదిల్చింది. గురువారం జరిగిన 9-16 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 8-0తో జపాన్‌ను చిత్తు చేసింది. అభిషేక్‌ (35, 43వ), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (45, 58వ) డబుల్‌ ధమాకా సాధించగా.. మన్‌దీ్‌ప సింగ్‌ (32వ), వివేక్‌ సాగర్‌ (39వ), మన్‌ప్రీత్‌ సింగ్‌ (58వ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (59వ) తలో గోల్‌ చేశారు. ఇక, 9-12 స్థానాల కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. కాగా, ఇతర మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 8-0తో చిలీపై, వేల్స్‌ 2-2 (2-1)తో ఫ్రాన్స్‌పై, సౌతాఫ్రికా 6-3తో మలేసియాపై గెలిచాయి.

దళిత గ్రామంలో డచ్‌ ప్లేయర్ల కుటుంబ సభ్యులు : నెదర్లాండ్స్‌ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కొందరు గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించారు. పూరీ జిల్లాలోని దళిత గ్రామం బిర్‌పురుషోత్తంపూర్‌ బహ్మన్‌ సాహిలో వీరు పర్యటించారు. గ్రామీణుల ఆతిథ్యాన్ని స్వీకరించి.. వారితో కలసి ఒడిస్సీ నృత్యం చేశారు. స్థానిక వంటకాలను రుచి చూశారు. సుమారు 18 మంది గ్రామ పర్యటనలో పాల్గొన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఈ ట్రిప్‌ ఎంతో ఉపయోగపడిందని డచ్‌ స్టార్‌ ప్లేయర్‌ టెర్రన్‌ పీటర్స్‌ తల్లి కాథలీన్‌ తెలిపింది. వీరి పర్యటనకు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాట్లు చేసింది.

తొలి సెమీఫైనల్‌ : ఆస్ట్రేలియా గీ జర్మనీ-సా.4.30

రెండో సెమీఫైనల్‌: బెల్జియం గీ నెదర్లాండ్స్‌-రా.7.00

Updated Date - 2023-01-27T03:23:34+05:30 IST