భారత్‌ జోరు సాగాలని..

ABN , First Publish Date - 2023-05-26T04:36:00+05:30 IST

స్వదేశంలో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో సత్తాచాటిన భారత హాకీ జట్టు ఇక ఐరోపా గడ్డపైనా అదే జోరు చూపాలన్న పట్టుదలతో ఉంది.

భారత్‌ జోరు సాగాలని..

హాకీ ప్రొ లీగ్‌లో బెల్జియంతో పోరు నేడు

లండన్‌: స్వదేశంలో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో సత్తాచాటిన భారత హాకీ జట్టు ఇక ఐరోపా గడ్డపైనా అదే జోరు చూపాలన్న పట్టుదలతో ఉంది. శుక్రవారం ఇక్కడ మొదలయ్యే ప్రొ లీగ్‌ యూరప్‌ లెగ్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ బెల్జియంతో భారత్‌ తన పోరును ఆరంభించనుంది. యూరప్‌ లెగ్‌లో భాగంగా భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లను నెదర్లాండ్స్‌, అర్జెంటీనాతో నెదర్లాండ్స్‌ వేదికగా ఆడనుంది. తొలి లెగ్‌లో భారత్‌ నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి పట్టికలో టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-05-26T04:36:00+05:30 IST