ఇవిగో.. టీమిండియా కొత్త జెర్సీలు

ABN , First Publish Date - 2023-06-02T03:49:34+05:30 IST

టీమిండియా అధికారిక కిట్‌ స్పాన్సరర్‌గా అడిడాస్‌ ఇటీవలే బీసీసీఐతో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవిగో.. టీమిండియా కొత్త జెర్సీలు

ముంబై: టీమిండియా అధికారిక కిట్‌ స్పాన్సరర్‌గా అడిడాస్‌ ఇటీవలే బీసీసీఐతో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇక టెస్ట్‌లు, వన్డేలు, టీ20లలో భారత జట్టు ధరించే కొత్తజెర్సీలను ఆ సంస్థ గురువారం విడుదలజేసింది. మూడు కొత్త జెర్సీలు ప్రఖ్యాత వాంఖడే స్టేడియంపై ఎగురుతున్న వీడియోను అడిడాస్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. తదుపరి అంతర్జాతీయ పోటీలలో మనోళ్లు ఈ కొత్త జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు. ఇందులో..ఈనెల ఏడు నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో నూతన జెర్సీని రోహిత్‌ సేన ధరించనుంది.

Updated Date - 2023-06-02T03:49:34+05:30 IST