హాకీలో కాంస్యమూ దక్కలేదు
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:39 AM
పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ పూర్తిగా నిరాశపరిచింది. ఫైనల్ చేరడంలో విఫలమైన జట్టు కనీసం కాంస్య పతకం కూడా దక్కించుకోలేకపోయింది.
కౌలాలంపూర్: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ పూర్తిగా నిరాశపరిచింది. ఫైనల్ చేరడంలో విఫలమైన జట్టు కనీసం కాంస్య పతకం కూడా దక్కించుకోలేకపోయింది. శనివారం ఇక్కడ జరిగిన కాంస్యం ప్లేఆఫ్ పోరులో భారత్ 1-3తో స్పెయిన్ చేతిలో పరాజయం పాలై రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టింది.గత టోర్నీ (2021లో)లోనూ నాలుగోస్థానంతోనే సరిపెట్టుకున్న యువ భారత్.. చివరిసారిగా 2016లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.