ఇంకా ఆలోచించుకోలేదు
ABN , First Publish Date - 2023-11-21T02:32:16+05:30 IST
కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ఆదివారంతో ముగిసింది. తన పదవీకాలంలో అతడు టీమిండియాను రెండు ఐసీసీ టోర్నీలలో...

అహ్మదాబాద్: కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ఆదివారంతో ముగిసింది. తన పదవీకాలంలో అతడు టీమిండియాను రెండు ఐసీసీ టోర్నీలలో ఫైనల్‌కు, మరో దానిలో సెమీఫైనల్‌కు చేర్చాడు. ఆదివారంనాటి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్..తన పదవి విషయమై ఇంకా ఆలోచించలేదన్నాడు. ‘దృష్టంతా వరల్డ్‌కప్‌పైనే నిలిచినందున కోచ్ పదవి గురించి ఆలోచించడానికి సమయమే లేదు. తీరిక దొరికినప్పుడు నిర్ణయం తీసుకుంటా’ అని ద్రవిడ్ తెలిపాడు.