Share News

శ్రీలంక కెప్టెన్లుగా హసరంగ, మెండిస్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:35 AM

కొలంబో: శ్రీలంక జట్టు తొలిసారిగా మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్‌లతో బరిలోకి దిగబోతోంది. ఇటీవలి కాలంలో దసున్‌ షనక

శ్రీలంక కెప్టెన్లుగా హసరంగ, మెండిస్‌

కొలంబో: శ్రీలంక జట్టు తొలిసారిగా మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్‌లతో బరిలోకి దిగబోతోంది. ఇటీవలి కాలంలో దసున్‌ షనక నేతృత్వలో జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిపై వేటు పడింది. తాజాగా టీ20 కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను నియమించారు. అలాగే వన్డే ఫార్మాట్‌లో కుశాల్‌ మెండిస్‌ జట్టును నడిపించనున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ చరిత అసలంక వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఈ ఎంపిక జరిగింది. ఇప్పటికే టెస్టుల్లో లంక దిముత్‌ కరుణరత్నె సారథ్యంలో ఆడుతుండడంతో జట్టుకు ముగ్గురు కెప్టెన్లు వచ్చినట్టయ్యింది.

Updated Date - Dec 31 , 2023 | 06:59 AM