Women ODI IND VS AUS : ఆత్మవిశ్వాసంతో హర్మన్ సేన
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:54 AM
వరుసగా రెండు టెస్టుల్లో అద్భుత విజయం.. దరిమిలా రెండింతలైన ఆత్మవిశ్వాసం..ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మూడు
ఆస్ట్రేలియాతో నేడు తొలి వన్డే
ముంబై: వరుసగా రెండు టెస్టుల్లో అద్భుత విజయం.. దరిమిలా రెండింతలైన ఆత్మవిశ్వాసం..ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగే తొలి మ్యాచ్‌కు సై అంటోంది. అంతేకాదు..ప్రత్యర్థిపై వన్డేల్లో తమకున్న పేలవ రికార్డును ఈసారి మెరుగుపరుచుకోవాలని పట్టుదలగా ఉంది. రెండు టెస్టులతోపాటు అంతకుముందు ఇంగ్లండ్‌పై టీ20లోనూ గెలవడం ద్వారా..గత మూడు మ్యాచ్‌ల్లో భారత్ అజేయంగా నిలిచింది. ఇదే ఊపులో మరిన్ని విజయాలు సాధించాలని భావిస్తోంది. కానీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని జట్టయిన ఆసీ్‌సపై నెగ్గడం అంత సులువు కాదు. ఇప్పటిదాకా 50 వన్డేల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 10 గెలిచి, ఏకంగా 40 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ప్రత్యర్థి ఎంత బలీయమైన జట్టో తెలియజేస్తుంది. ఇకపోతే..భారత్‌లో 21 వన్డేలు ఆడితే..నాలుగింటిలోనే మనకు విజయం దక్కగా, 17 పోటీల్లో ఓడిపోయింది. అయితే వన్డే అరంగేట్రంకోసం వేచిచూస్తున్న శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, మన్నత్ కశ్యప్, టిటాస్ సాధువంటి యువ క్రికెటర్లతో టీమిండియాలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మధ్యాహ్నం 1.30 నుంచి స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో..