Harika : అగ్రస్థానంలో హారిక

ABN , First Publish Date - 2023-09-04T02:28:00+05:30 IST

టాటా స్టీల్‌ చెస్‌ మహిళల బ్లిట్జ్‌ విభాగం తొలిరోజు తొమ్మిది రౌండ్‌లు ముగిసేసరికి తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.

Harika : అగ్రస్థానంలో హారిక

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ మహిళల బ్లిట్జ్‌ విభాగం తొలిరోజు తొమ్మిది రౌండ్‌లు ముగిసేసరికి తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ వెన్‌జున్‌ (చైనా) కూడా 6.5 పాయింట్లతోనే ఉన్నా.. టైబ్రేకర్‌ స్కోరుతో హారిక అగ్రస్థానంలో నిలిచింది. వెన్‌జున్‌ రెండో స్థానంలో నిలవగా.. హంపి (5) మూడో స్థానంలో కొనసాగుతోంది. ర్యాపిడ్‌ రౌండ్‌ విజేత దివ్యా దేశ్‌ముఖ్‌ (5) నాలుగో స్థానంలో నిలిచింది. సోమవారం మరో తొమ్మిది రౌండ్ల అనంతరం విజేతను నిర్ణయిస్తారు.

Updated Date - 2023-09-04T02:28:00+05:30 IST