MS Dhoni: ధోనీ అవుటయ్యాక చెపాక్ స్టేడియం సైలెంట్.. హార్దిక్ పాండ్యా కూడా సెలబ్రేషన్స్ చేసుకోకుండా..

ABN , First Publish Date - 2023-05-24T11:16:08+05:30 IST

టీమిండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఈ ఐపీఎల్‌లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో అభిమానులు అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నారు.

MS Dhoni: ధోనీ అవుటయ్యాక చెపాక్ స్టేడియం సైలెంట్.. హార్దిక్ పాండ్యా కూడా సెలబ్రేషన్స్ చేసుకోకుండా..

టీమిండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ధోనీకి (MS Dhoni) ఈ ఐపీఎల్‌లో (IPL 2023) అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ (Dhoni Retirment) అని వార్తలు వస్తుండడంతో అభిమానులు అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నారు. అందుకే చెన్నై టీమ్ ఎక్కడ ఆడితే అక్కడ ధోనీకి అభిమానుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది (CKS Fans). ధోనీ బ్యాటింగ్‌తో పెద్దగా రాణించలేకపోతున్నా, అతడు మైదానంలోకి దిగితే చాలా ఉర్రూతలూగిపోతున్నారు.

మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ (GTvsCSK) జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ చివర్లో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినపుడు చెపాక్ స్టేడియంలోని అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో ధోనీ ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ కేకలు వేశారు. అయితే ధోనీ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ధోనీ అవుటయ్యాక చెపాక్ స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. ధోనీ పెవిలియన్‌కు వెళుతున్నప్పుడు అంతా నిశబ్దంగా ఉండిపోయారు.

Ravindra Jadeja: జడేజా సూపర్ బౌలింగ్.. డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేసిన బంతి ఎలా వెళ్లిందో చూడండి..

ధోనీ క్యాచ్ పట్టిన గుజరాత్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కూడా పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోకుండా సైలెంట్ అయిపోయాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నై టీమ్ 15 పరుగులతో విజయం సాధించి ఫైనల్ చేరింది. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. కాగా, వచ్చే ఐపీఎల్‌లో ఆడేది, లేనిది మరో 7-8 నెలల్లో నిర్ణయించుకుంటానని మ్యాచ్ అనంతరం ధోనీ చెప్పాడు.

Updated Date - 2023-05-24T11:16:08+05:30 IST