Ravindra Jadeja: జడేజా సూపర్ బౌలింగ్.. డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేసిన బంతి ఎలా వెళ్లిందో చూడండి..

ABN , First Publish Date - 2023-05-24T10:10:58+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎప్పట్నుంచో ఆడుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రతి మ్యాచ్‌లోనూ బంతితోనూ లేదా బ్యాట్‌తోనూ రాణిస్తూ చెన్నై టీమ్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారాడు.

Ravindra Jadeja: జడేజా సూపర్ బౌలింగ్.. డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేసిన బంతి ఎలా వెళ్లిందో చూడండి..

చెన్నై సూపర్ కింగ్స్‌కు (CSK) ఎప్పట్నుంచో ఆడుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ప్రతి మ్యాచ్‌లోనూ బంతితోనూ లేదా బ్యాట్‌తోనూ రాణిస్తూ చెన్నై టీమ్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారాడు. మంగళవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (GTvsCSK) మధ్య తొలి క్వాలిఫయర్ (Qualifier 1) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాట్‌తోనూ, బాల్‌తోనూ మెరిశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన జడేజా 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్‌లో జడేజా బంతితో మాయ చేశాడు. 4 ఓవర్లు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. వాటిల్లో ప్రమాదకర డేవిడ్ మిల్లర్‌ను (David Miller) అద్భుతమైన బంతితో అవుట్ చేశాడు. మిల్లర్ ఆడుతున్నప్పుడు 13వ ఓవర్ వేయడానికి వచ్చిన జడేజా చక్కగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతి మిల్లర్‌కు షాకిచ్చింది.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. వారి ఆగ్రహానికి కారణమేంటంటే..

జడేజా వేసిన గుడ్ లెంగ్త్ బంతి అనూహ్యంగా స్పిన్ అయి మిల్లర్ డిఫెన్స్‌ను ఛేదించింది. లెగ్ వికెట్‌ను పడగొట్టింది. ఆ టర్న్ చూసి మిల్లర్ షాకయ్యాడు. అవుటయ్యాక కూడా నమ్మలేకపోయాడు. మిల్లర్ ఎంత ప్రమాదకర ఆటగాడో తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల మిల్లర్‌ను కేవలం 4 పరుగులకే పరిమితం చేయడంతో చెన్నై సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షనక వికెట్‌ను కూడా జడేజా పడగొట్టాడు.

Updated Date - 2023-05-24T10:10:58+05:30 IST