‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పేస్, విజయ్ అమృత్‌రాజ్
ABN , Publish Date - Dec 14 , 2023 | 05:47 AM
తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన భారత టెన్నిస్ వెటరన్ స్టార్ లియాండర్ పేస్, వ్యాఖ్యాత, మాజీ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ అరుదైన ఘనత సాధించారు. వీరిద్దరూ
ఆసియా నుంచి అరుదైన ఘనత
న్యూఢిల్లీ: తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన భారత టెన్నిస్ వెటరన్ స్టార్ లియాండర్ పేస్, వ్యాఖ్యాత, మాజీ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ అరుదైన ఘనత సాధించారు. వీరిద్దరూ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. డబుల్స్, మిక్స్‌డ్‌లో కలిపి 18సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన 50 ఏళ్ల లియాండర్ ఆటగాడి విభాగం నుంచి హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికవగా.. 69 ఏళ్ల అమృత్‌రాజ్, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు, రచయిత రిచర్డ్ ఎవాన్స్‌ను ఇతర హోదాల్లో క్రీడకు చేసిన సేవలకు గుర్తింపుగా హాల్ ఆఫ్ ఫేమ్‌కు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఎంపిక చేసింది. కాగా, ఆసియా నుంచి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకున్న వ్యక్తులుగా పేస్, అమృత్‌రాజ్ రికార్డుకెక్కారు.