గార్సియా అవుట్‌ అల్కారజ్‌, స్విటోలినా ముందంజ

ABN , First Publish Date - 2023-06-01T00:21:09+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరో సీడెడ్‌ ప్లేయర్‌ ఇంటిబాట పట్టింది. లోకల్‌ స్టార్‌, మహిళల ఐదోసీడ్‌ కరోలిన్‌ గార్సియాకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో

గార్సియా అవుట్‌ అల్కారజ్‌, స్విటోలినా ముందంజ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరో సీడెడ్‌ ప్లేయర్‌ ఇంటిబాట పట్టింది. లోకల్‌ స్టార్‌, మహిళల ఐదోసీడ్‌ కరోలిన్‌ గార్సియాకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో రష్యాకు చెందిన అన్నా బ్లింకోవా 4-6, 6-3, 7-5తో గార్సియాకు షాకిచ్చి మూడోరౌండ్లో ప్రవేశించింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో బ్లింకోవా తొమ్మిదిసార్లు మ్యాచ్‌ పాయింట్‌ను కాచుకొని పైచేయి సాధించింది. ఇక, మాజీ చాంపియన్‌ జెలెనా ఓస్టాపెంకోను అమెరికా యువ కెరటం పేటన్‌ స్టియర్న్స్‌ కంగుతినిపించింది. స్టియర్న్స్‌ 6-3, 1-6, 6-2తో 17వ సీడ్‌ ఓస్టాపెంకో (లాత్వియా)ను చిత్తుచేసింది. ప్రత్యర్థి గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలగడంతో మూడోసీడ్‌ పెగులా నేరుగా మూడోరౌండ్‌లో అడుగుపెట్టింది. ఉక్రెయిన్‌ స్టార్‌ క్రీడాకారిణి స్విటోలినా 2-6, 6-3, 6-1తో క్వాలిఫయర్‌ స్టామ్‌ హంటర్‌పై, రెండోసీడ్‌ సబలెంకా 7-5, 6-2తో షిమనోవిచ్‌పై గెలిచి మూడోరౌండ్‌ చేరారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ 6-1, 3-6,6-1, 6-2తో డేనియల్‌పై, ఐదోసీడ్‌, సిట్సిపాస్‌ 6-3, 7-6(4), 6-2తో కార్‌బాలెస్‌పై నెగ్గగా, కొకినాకిస్‌ 3-6, 7-5, 6-3, 6-7(7), 6-3తో మాజీ విజేత వావ్రింకా ఇంటికి పంపించాడు.

సాకేత్‌-యుకీ జోడీ బోణీ: పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాకేత్‌ మైనేని-యుకీ భాంబ్రీ జోడీ శుభారంభం చేసింది. సాకేత్‌-యుకీ జంట 6-3, 6-2తో ఫ్రాన్స్‌ ద్వయం కొకాడ్‌-రిండర్‌నెచ్‌పై గెలిచి రెండోరౌండ్లో అడుగుపెట్టింది.

Updated Date - 2023-06-01T00:21:09+05:30 IST