మేమిద్దరం.. మళ్లీ ఇక్కడ

ABN , First Publish Date - 2023-07-11T00:10:59+05:30 IST

భారత్‌-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్‌ బుధవారం ఇక్కడ ప్రారంభం కానుంది.

మేమిద్దరం.. మళ్లీ ఇక్కడ

డొమినికా: భారత్‌-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్‌ బుధవారం ఇక్కడ ప్రారంభం కానుంది. అయితే డొమినికాలో చివరిసారి 2011లో భారత్‌ ఓ టెస్ట్‌ ఆడింది. నాడు ధోనీ కెప్టెన్‌కాగా.. ద్రవిడ్‌, విరాట్‌ జట్టు సభ్యులుగా ఉన్నారు. ఇక ఈసారి ద్రవిడ్‌ కోచ్‌గా వ్యహరిస్తుండగా, కోహ్లీ మాత్రం అప్పటిలాగానే కేవలం సభ్యుడిగా ఉన్నాడు. ఈనేపథ్యంలో పుష్కరం కిందటి జ్ఞాపకాన్ని నెమరువేసుకొంటూ తాను, ద్రవిడ్‌ ఉన్న ఫొటోను డొమినికానుంచి విరాట్‌ షేర్‌ చేశాడు. ‘నాటి జట్టులోని మేమిద్దరం మళ్లీ ఇక్కడికి వస్తామని ఊహించలేదు’ అని ఉద్వేగభరితంగా విరాట్‌ రాశాడు.

Updated Date - 2023-07-11T00:10:59+05:30 IST