ఆసియా కప్‌పై తుది నిర్ణయం ఐపీఎల్ ముగిశాకే : జై షా
ABN , First Publish Date - 2023-05-26T04:38:11+05:30 IST
ఆసియా కప్‌ను ఎక్కడ నిర్వహించాలన్న విషయాన్ని దానిపై ఐపీఎల్ ఫైనల్ అయిపోయిన తర్వాత నిర్ణయిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం తెలిపారు.

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ను ఎక్కడ నిర్వహించాలన్న విషయాన్ని దానిపై ఐపీఎల్ ఫైనల్ అయిపోయిన తర్వాత నిర్ణయిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం తెలిపారు. ఈనెల 28న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్‌ను వీక్షించేం దుకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ప్రతినిధులు వస్తున్నారనీ, అప్పుడు వారితో చర్చించి ఆసియాకప్ వేదికపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగాలి. కానీ, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌కు తమ జట్టు వెళ్లదని బీసీసీఐ ఇప్పటికే తేల్చేసింది. అయితే, భారత్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో, మిగతా మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్‌ను పాక్ ప్రతిపాదించగా, ఇందుకు ఏసీసీలోని మిగతా సభ్యదేశాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే.