కప్పుపై కాళ్లుపెట్టి...
ABN , First Publish Date - 2023-11-21T02:35:48+05:30 IST
ఆరోసారి వరల్డ్‌క్‌పను సొంతం చేసుకున్న ఆస్ర్టేలియా జట్టు ఆటగాడు మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టడం వివాదాన్ని రాజేసింది...

న్యూఢిల్లీ: ఆరోసారి వరల్డ్‌క్‌పను సొంతం చేసుకున్న ఆస్ర్టేలియా జట్టు ఆటగాడు మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టడం వివాదాన్ని రాజేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో వరల్డ్‌క్‌పపై మార్ష్ కాళ్లుపెట్టి ఉన్న ఫొటోలను కమిన్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో మెగా ట్రోఫీని ఇంతగా అవమానపరుస్తారా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 1983లో కపిల్ నెత్తిన పెట్టుకొన్న ఫొటోను పోస్టు చేసిన ఓ నెటిజన్.. ‘మన సంస్కృతికి.. వాళ్లకు తేడా ఇదే’ అని రాశాడు. ‘అది వరల్డ్‌కప్.. దయచేసి గౌరవం ఇవ్వండ’ని మరొకరు పోస్టు చేశారు.