Khelo India : 10 నుంచి ‘దస్‌ కా దమ్‌’

ABN , First Publish Date - 2023-03-08T00:56:49+05:30 IST

అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈనెల 10 నుంచి 31 వరకు ఖేలో ఇండియా ‘దస్‌ కా దమ్‌’ పేరిట కేంద్ర క్రీడాశాఖ దేశవ్యాప్తంగా ..

 Khelo India : 10 నుంచి ‘దస్‌ కా దమ్‌’

పది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రకు చోటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈనెల 10 నుంచి 31 వరకు ఖేలో ఇండియా ‘దస్‌ కా దమ్‌’ పేరిట కేంద్ర క్రీడాశాఖ దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తోంది. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల కోసం రూ.50 లక్షల బడ్జెట్‌ను మంజూరు చేసింది. మొత్తం పది క్రీడాంశాల్లో 10 రాష్ట్రాల్లో ఈ పోటీలను నిర్వహిస్తోంది. నిజామాబాద్‌లో ఉషు, వరంగల్‌లో జూడో, విజయవాడలో ఖో-ఖో, హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, ఆర్చరీ, ఖో-ఖో విభాగాల్లో జరుగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో దాదాపు 15 వేల మంది మహిళా అథ్లెట్లు పాల్గొననున్నారు. శుక్రవారం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.

Updated Date - 2023-03-08T00:56:54+05:30 IST