Mohun Bagan: 23 ఏళ్లలో తొలిసారి..
ABN , First Publish Date - 2023-09-04T02:47:38+05:30 IST
ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ తన పునర్‌వైభవాన్ని చాటుకుంది. 23 ఏళ్లలో తొలిసారిగా ఈ ఫుట్‌బాల్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బగాన్ జట్టు 1-0తో ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి కప్‌ను ముద్దాడింది.
మోహన్ బగాన్‌కు డ్యూరాండ్ కప్
కోల్‌కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ తన పునర్‌వైభవాన్ని చాటుకుంది. 23 ఏళ్లలో తొలిసారిగా ఈ ఫుట్‌బాల్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బగాన్ జట్టు 1-0తో ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి కప్‌ను ముద్దాడింది. రెఫరీ హెచ్చరికతో ఒకరు మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించడంతో 10 మంది ఆటగాళ్లతోనే ఆడిన బగాన్ జట్టుకు దిమిత్రి పెట్రాటోస్ 71వ నిమిషంలో గోల్ చేసి విజయాన్ని కట్టబెట్టాడు. 2000 సంవత్సరంలో చివరిగా ఈ టోర్నీలో విజేతగా నిలిచిన మోహన్ బగాన్‌కు ఇది ఓవరాల్‌గా 17వ డ్యూరాండ్ కప్ టైటిల్.