ఈసారి వదలొద్దని..
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:39 AM
సెంచూరియన్: దక్షిణాఫిక్రాలో 31 ఏళ్ల ఎదురుచూపులకు తెర దించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ జట్టు బరిలోకి దిగనుంది.
భారత్‌ను ఊరిస్తున్న ‘సఫారీ’ సిరీస్ సవాల్ విసరనున్న
దక్షిణాఫ్రికా నేటి నుంచి తొలి టెస్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,
న్యూజిలాండ్ జట్లను వారి సొంత గడ్డపైనే ఓడించిన టీమిండియాకు దక్షిణాఫ్రికా మాత్రం అంత సులువుగా లొంగడం లేదు. సెనా జట్లలో ఒకటిగా ఉన్న సఫారీలను ఓడించేందుకు భారత్ తొలి
సారిగా 1992లో పర్యటించింది. కానీ ఇప్పటి వరకు టెస్టు ఫార్మాట్‌లో మాత్రం
విజేతగా నిలువలేకపోయింది. ఇప్పుడు తొమ్మిదోసారి తమ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధమైంది.
ఈసారైనా రోహిత్ సేన సఫారీ కోటను బద్దలు కొట్టి చరిత్రను తిరగరాస్తుందా?
మధ్యాహ్నం 1.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్‌లో..
సెంచూరియన్: దక్షిణాఫిక్రాలో 31 ఏళ్ల ఎదురుచూపులకు తెర దించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ జట్టు బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఈ పర్యటనలో మూడు టీ20ల సిరీ్‌సను 1-1తో సమం చేయగా.. మూడు వన్డేల సిరీ్‌సను 2-1తో గెలుచుకుంది. కానీ నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్ కోసం అత్యంత కఠిన సవాల్‌కు సై అనబోతోంది. ఇందులో భాగంగా బాక్సింగ్ డే (మంగళవారం) నుంచి ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికి 8సార్లు ఇక్కడ టెస్టు సిరీస్ ఆడినా భారత్ ఏడుసార్లు ఓడి ఒక్కసారి డ్రా చేయగలిగింది. చివరిసారి 2021-22లో మూడు టెస్టులు ఆడి 1-2తో ఓడింది. ఆ సిరీస్ తర్వాతే విరాట్ కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో వైదొలిగాడు. అలాగే సీనియర్లు పుజార, రహానె లేకుండా దశాబ్ద కాలం తర్వాత విదేశాల్లో జట్టు టెస్టు సిరీస్ ఆడబోతోంది. టీమ్ కూడా సరికొత్తగా ఉంది. ఈ ఉత్సాహంతో జట్టు కోరుకునే, అభిమానులకు జోష్ నింపే సిరీస్ విజయం దక్కించుకుంటారని ఆశిద్దాం. ఇక ఓవరాల్‌గా సఫారీ నేలపై భారత్ 23 మ్యాచ్‌లు ఆడితే నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
భారమంతా సీనియర్లపైనే..: వన్డే వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ కలిసి మ్యాచ్ ఆడబోతున్నారు. జట్టు ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా భారమంతా ఈ వెటరన్స్‌పైనే ఉంది. ఎందుకంటే ఇక్కడి బౌన్సీ పిచ్‌లపై ఐదు రోజులపాటు బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. అటు శ్రేయాస్, గిల్, జైస్వాల్‌లకు దక్షిణాఫ్రికాలో టెస్టు ఆడనుండడం ఇదే తొలిసారి. రోహిత్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేయనుండగా, గిల్ వన్‌డౌన్‌లో రానున్నాడు. ఇక పది నెలల విరామం తర్వాత టెస్టు ఆడబోతున్న రాహుల్, శ్రేయాస్ మిడిలార్డర్ బాధ్యతను తీసుకుంటారు. కానీ మరోవైపు ఇక్కడ సీనియర్లు రోహిత్ సగటు 15.37, రాహుల్ సగటు 25.60 మాత్రంగానే ఉండడం ఆందోళనకరం. ఒక్క కోహ్లీ మాత్రమే 51.35తో దక్షిణాఫ్రికా గడ్డపై ఆధిక్యం చూపుతున్నాడు. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, శార్దూల్‌తో పాటు నాలుగో పేసర్‌గా ముకేశ్, ప్రసిద్ధ్‌ల మధ్య పోటీ కనిపిస్తోంది. ముకేశ్‌కన్నా ఎక్స్‌ట్రా బౌన్స్ రాబట్టగల ప్రసిద్ధ్ వైపు మొగ్గు చూపవచ్చు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జడేజాకే అవకాశం ఉంది.
ఆత్మవిశ్వాసంతో బవుమా బృందం
రబాడ, ఎన్‌గిడి, కొట్జీ, జాన్సెన్‌లతో కూడిన దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను భయపెడుతోంది. వీరి బౌన్సీ బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు రాబట్టడం సవాల్‌తో కూడుకుంది. ఈ సిరీ్‌సకు తాజాగా ఉంచేందుకు రబాడకు వన్డే, టీ20లకు విశ్రాంతినిచ్చారు. అలాగే కొట్జీ, జాన్సెన్‌లను కూడా ఈ సిరీ్‌సల్లో పూర్తిగా ఆడించలేదు ఇక కెప్టెన్ బవుమా కూడా వరల్డ్‌కప్ తర్వాత బ్యాట్ పట్టనున్నాడు. డీన్ ఎల్గర్‌కే ఇదే చివరి సిరీస్ కానుండగా.. మార్‌క్రమ్, జోర్జి, పీటర్సన్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం
దక్షిణాఫ్రికాలో అత్యంత వేగవంతమైన పిచ్‌లలో సూపర్‌స్పోర్ట్ పార్క్ ఒకటి. స్వతహాగానే పేసర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ జరిగిన 28 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 22 మ్యాచ్‌లు గెలవడం విశేషం. అయితే చివరి టూర్‌లో భారత్ 113 రన్స్‌తో గెలిచింది. ఇక తొలి రెండు రోజులపాటు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.
ఆత్మవిశ్వాసంతో బవుమా బృందం
రబాడ, ఎన్‌గిడి, కొట్జీ, జాన్సెన్‌లతో కూడిన దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను భయపెడుతోంది. వీరి బౌన్సీ బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు రాబట్టడం సవాల్‌తో కూడుకుంది. ఈ సిరీ్‌సకు తాజాగా ఉంచేందుకు రబాడకు వన్డే, టీ20లకు విశ్రాంతినిచ్చారు. అలాగే కొట్జీ, జాన్సెన్‌లను కూడా ఈ సిరీ్‌సల్లో పూర్తిగా ఆడించలేదు ఇక కెప్టెన్ బవుమా కూడా వరల్డ్‌కప్ తర్వాత బ్యాట్ పట్టనున్నాడు. డీన్ ఎల్గర్‌కే ఇదే చివరి సిరీస్ కానుండగా.. మార్‌క్రమ్, జోర్జి, పీటర్సన్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, విరాట్, రాహుల్, శ్రేయాస్, జడేజా, శార్దూల్, బుమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్, మార్‌క్రమ్, జోర్జి, బవుమా (కెప్టెన్), పీటర్సన్, వెరీనె, జాన్సెన్, కేశవ్, కొట్జీ, రబాడ, ఎన్‌గిడి.