వరల్డ్‌క్‌పలో జట్ల సంఖ్యను పెంచొద్దు
ABN , First Publish Date - 2023-11-21T02:25:48+05:30 IST
దక్షిణాఫ్రికాలో జరగనున్న వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను మార్చాలని ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2027లో జరిగే మెగా ఈవెంట్‌లో...

ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి?
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జరగనున్న వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను మార్చాలని ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2027లో జరిగే మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 10 నుంచి 14కు పెంచాలని నిర్ణయించారు. వీటిని రెండు గ్రూప్‌లుగా చేసి.. సూపర్ సిక్స్‌కు ఎంపిక చేస్తారు. వీటినుంచి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ్‌స చేరతాయి. ఈ విధానంలో భారత్ ముందుగానే నాకౌట్ అయ్యే చాన్సులూ ఉంటాయి. ఇదే జరిగితే రెవెన్యూ పరంగా భారీగా నష్టం వచ్చే ప్రమాదాలుంటాయి. 2007లో టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఐసీసీ బాగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 10 జట్ల పాత ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ఒత్తిడి చేస్తోందని సమాచారం.