తెలుగు టాలన్స్‌కు నిరాశ

ABN , First Publish Date - 2023-06-25T01:25:35+05:30 IST

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌)లో తెలుగు టాలన్స్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్‌ ఈగల్స్‌ షూటౌట్‌లో 43తో టాలన్స్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది.

తెలుగు టాలన్స్‌కు నిరాశ

జైపూర్‌: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌)లో తెలుగు టాలన్స్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్‌ ఈగల్స్‌ షూటౌట్‌లో 43తో టాలన్స్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. మొదట 3535 స్కోరుతో టై కాగా.. ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరుజట్లు 4040తో సమంగా నిలిచాయి. దీంతో అనివార్యమైన షూటౌట్‌లో ఈగల్స్‌ పైచేయి సాధించింది. మరో సెమీస్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ 3828తో రాజస్థాన్‌ పేట్రియాట్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే టైటిల్‌ఫైట్‌లో ఈగల్స్‌తో ఐరన్‌మెన్‌ తలపడనుంది.


Updated Date - 2023-06-25T01:25:35+05:30 IST