డేవిస్‌కప్ వరల్డ్‌గ్రూప్-1లో భారత ప్రత్యర్థి పాక్
ABN , First Publish Date - 2023-09-22T03:08:52+05:30 IST
చ్చే ఏడాది జరిగే డేవిస్ కప్ వరల్డ్‌గ్రూప్-1 ప్లేఆ్‌ఫ్సలో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. డ్రా వివరాలను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే డేవిస్ కప్ వరల్డ్‌గ్రూప్-1 ప్లేఆ్‌ఫ్సలో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. డ్రా వివరాలను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విడుదల చేసింది. ఆతిథ్య జట్టుగా వేదిక, మ్యాచ్‌ల తేదీలను నిర్ణయించే అధికారం పాక్‌కు దక్కింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్‌లను పాక్‌లోనే నిర్వహిస్తామని పాకిస్థాన్ టెన్నిస్ సమాఖ్య స్పష్టం చేసింది. 2019లో ఆసియా ఓసియానియా గ్రూప్-1లో పాక్‌తో భారత్ తలపడింది. అయితే, భద్రతా కారణాల రీత్యా వేదికను కజకిస్థాన్‌కు మార్చారు. 1962లో చివరిసారిగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది.