Crossbow Shooting: ఏప్రిల్‌లో క్రాస్ బౌ షూటింగ్ చాంపియన్‌షిప్

ABN , First Publish Date - 2023-03-18T19:24:48+05:30 IST

తెలంగాణ క్రౌస్ బౌ షూటింగ్ అసోసియేషన్ (Telangana Crossbow Shooting Association) ఆధ్వర్యంలో...

Crossbow Shooting:  ఏప్రిల్‌లో క్రాస్ బౌ షూటింగ్ చాంపియన్‌షిప్

హైదరాబాద్: తెలంగాణ క్రౌస్ బౌ షూటింగ్ అసోసియేషన్ (Telangana Crossbow Shooting Association) ఆధ్వర్యంలో జరుగనున్న మొదటి ఓపెన్ స్టేట్ చాంపియన్‌షిప్‌కి సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ హైదరాబాదులో జరిగింది. హైదరాబాదులోని ప్రముఖ క్రీడా ప్రాంగణమైన ఎల్‌బి స్టేడియం (LB Stadium)లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ (SATS) ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ బ్యానర్‌ని ఆవిష్కరించారు. నగరంలోని హిమాయత్ నగర్ పరిధిలో గల దోమల్‌గూడ - గగన్‌మహల్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ (Government College of Physical Education)లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 30 తేదీ వరకూ ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ చైతన్య, ఉపాధ్యక్షురాలు మేజర్ కె పద్మజ, ప్రధాన కార్యదర్శి వసంత మాధురి, కోశాధికారి బిఎం పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి భువనేశ్వరి పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొనదలచినవారు 70753 40123 నెంబరు ద్వారా సంప్రదించవచ్చని తెలంగాణ క్రౌస్ బౌ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

5.jpg

Updated Date - 2023-03-18T19:31:12+05:30 IST