Share News

Mohammed Shami: మహమ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అవార్డు.. క్రికెటర్లలో అతనొక్కడే!

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:31 PM

అర్జున అవార్డ్.. క్రీడల్లో ఇది రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ..

Mohammed Shami: మహమ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అవార్డు.. క్రికెటర్లలో అతనొక్కడే!

Mohammed Shami Arjuna Award: అర్జున అవార్డ్.. క్రీడల్లో ఇది రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అందుకోబోతున్నాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుత ప్రదర్భన కనబరిచినందుకే.. అతడ్ని ఈ అవార్డు వరిస్తోంది. ఈ అవార్డు అందుకుంటున్న మొత్తం 26 మంది అథ్లెట్స్‌లో షమీ ఒక్కడే క్రికెటర్. ఈ మెగాటోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న షమీ.. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. జట్టులో అతడు అడుగుపెట్టాకే టీమిండియా బౌలింగ్ ఎటాక్ మరింత పటిష్టంగా మారిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

అంతేకాదు.. ఈ టోర్నీలో రెండుసార్లు (శ్రీలంక, న్యూజిలాండ్ జట్లపై) ఫైఫర్ (ఐదు వికెట్లు లేదా అంతకన్నా ఎక్కువ) నమోదు చేసి.. వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అయితే.. ఏడు వికెట్లు పడగొట్టి, ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 33 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్.. ప్రధానంగా వన్డే క్రికెట్‌లో కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 43 వికెట్లతో ఆధిపత్యం చెలాయించాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో అతడు నిలకగా ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో మూడు ఫార్మాట్లలో భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడంలో.. మహమ్మద్ షమీ కీలక పాత్ర పోసించాడు. షమీతో పాటు మరో 25 మంది భారతీయ క్రీడాకారులు ఈ అర్జున పురస్కారాన్ని అందుకోనున్నారు. భారతదేశపు స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డికి భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందజేయనున్నారు.


అర్జున అవార్డు అందుకోనున్న 26 మంది క్రీడాకారుల పూర్తి జాబితా (2023):

ఓజాస్ ప్రవీణ్ దేవ్‌తలే (విలుకాడు), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి (చెస్), మహమ్మద్ షమీ (క్రికెట్), అనుష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్), దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రస్సేజ్), దీక్షా దాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ), పుఖ్రంబం సుశీల చాను (హాకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రీతూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో-ఖో), పింకీ (లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఈషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), ఆంటిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వుషు), శీతల్ దేవి (పారా ఆర్చరీ), అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కెనోయింగ్)

Updated Date - Dec 20 , 2023 | 05:31 PM