IPL 2023: హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసి అవుటైన బట్లర్

ABN , First Publish Date - 2023-04-02T16:15:13+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad

IPL 2023: హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసి అవుటైన బట్లర్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) స్కోరు పరుగులు పెడుతోంది. 6 ఓవర్లకే 85 పరుగులు దాటేసి భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ జోస్ బట్లర్ వీరవిహారంతో స్కోరు బోర్డు అలుపు లేకుండా పరుగులు తీసింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని బట్లర్ హోరెత్తించాడు.

20 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతిని కూడా ఫోర్ బాదిన బట్లర్.. ఫజల్‌హక్ ఫరూకీ బౌలింగులో బౌల్డయ్యాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్ కూడా జోరుగానే ఆడుతున్నాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. రాజస్థాన్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. సంజు శాంసన్ 1, యశస్వి జైస్వాల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-04-02T16:15:13+05:30 IST