IPL 2023: జియో సినిమాకు పోటీగా దుమ్మురేపుతున్న స్టార్‌స్పోర్ట్స్!

ABN , First Publish Date - 2023-04-03T21:12:45+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2023) టీవీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ (Star Sports) ఈసారి

IPL 2023: జియో సినిమాకు పోటీగా దుమ్మురేపుతున్న స్టార్‌స్పోర్ట్స్!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2023) టీవీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ (Star Sports) ఈసారి రికార్డుస్థాయిలో వ్యూయర్‌షిప్ రాబట్టుకుంటోంది. టీమిండియా(Team India) మ్యాచ్‌లకు కూడా స్టార్‌ స్పోర్ట్సే బ్రాడ్‌కాస్టర్‌గా ఉంది. అయితే, ఆశించిన వ్యూయర్‌షిప్ రాకపోవడంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అయితే, ఇప్పుడా లోటును ఐపీఎల్ ద్వారా పూడ్చుకునే ప్రయత్నం చేస్తోంది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్‌‌కు రికార్డుస్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. మీడియా, చానళ్లకు సంబంధించిన వ్యూయర్‌షిప్‌ను లెక్కగట్టే ‘ఎక్స్‌చేంజ్ 4 మీడియా’ ఈ వివరాలను వెల్లడించింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి 29 శాతం వ్యూయర్‌షిప్ పెరిగినట్టు పేర్కొంది.

ఐపీఎల్-2023 తొలి మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్‌లో ఏకంగా 14 కోట్ల మంది వీక్షించారు. గత సీజన్‌తో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువ. గుజరాత్-చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఆరంభ వేడుకలను 140 మిలియన్ల మంది యూజర్లు స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించారు. మరోవైపు, జియో సినిమా(Jio Cinema) కూడా వ్యూయర్‌షిప్‌లో దుమ్మురేపింది. తొలి మ్యాచ్‌ను ఈ యాప్ వేదికగా 6 కోట్ల మంది వీక్షించారు.

ఒక రోజు అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా కూడా జియో సినిమా సరికొత్త రికార్డు సృష్టంచింది. అయితే, జియో సినిమా యాప్‌లో సాంకేతిక లోపాలు యూజర్లను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. కామెంట్రీ కూడా నాసిరకంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లు మరింత మెరుగైన అనుభవం కోసం స్టార్ట్‌స్పోర్ట్స్‌కు మళ్లుతున్నారు. టీవీలు అందుబాటులో లేనివారు మాత్రమే ఫోన్లలో జియో సినిమా యాప్ ద్వార క్రికెట్ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు.

Updated Date - 2023-04-03T21:12:45+05:30 IST