నాకౌట్ రేసులో ఛెత్రి బృందం
ABN , First Publish Date - 2023-09-22T03:11:04+05:30 IST
ఆసియా క్రీడల్లో సునీల్ ఛెత్రి గోల్‌తో నాకౌట్ ఆశలను భారత ఫుట్‌బాల్ జట్టు సజీవంగా ఉంచుకొంది. గ్రూప్-ఎ మ్యాచ్‌లో
ఆసియా క్రీడల్లో సునీల్ ఛెత్రి గోల్‌తో నాకౌట్ ఆశలను భారత ఫుట్‌బాల్ జట్టు సజీవంగా ఉంచుకొంది. గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ 1-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. 85వ నిమిషంలో ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో మిరాండాను రహ్మత్ మొరటుగా అడ్డుకోవడంతో టీమిండియాకు రెఫరీ పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని ఛెత్రి గోల్‌లోకి పంపి జట్టును గెలిపించాడు. తర్వాతి మ్యాచ్‌లో మయన్మార్‌తో భారత్ తలపడనుంది. మహిళల జట్టు 1-2తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది.