IPL 2023: రుతురాజ్ సెంచరీని అడ్డుకున్న కొత్త రూల్.. ఎలా ఔట్ అయ్యాడో చూడండి.. చెన్నై ఫ్యాన్స్ ఫైర్..

ABN , First Publish Date - 2023-04-01T07:49:52+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అద్భుతంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)తో శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్(Gujarat Titan) 5 వికెట్లతో విజయం సాధించింది.

IPL 2023: రుతురాజ్ సెంచరీని అడ్డుకున్న కొత్త రూల్.. ఎలా ఔట్ అయ్యాడో చూడండి.. చెన్నై ఫ్యాన్స్ ఫైర్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అద్భుతంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)తో శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్(Gujarat Titans) 5 వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అద్భుత ఆటతీరుతో చెలరేగి 50 బంతుల్లోనే 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే రుతురాజ్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. జోరు మీదున్న రుతురాజ్ 18వ ఓవర్లో వచ్చిన హై ఫుల్ టాస్‌ను (High full-toss) గాల్లోకి లేపాడు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) డీప్‌లో అద్భుతంగా డైవ్ చేసి ఆ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది నడుము కంటే పై ఎత్తులో వచ్చిందని అంపైర్‌కు అనుమానం వచ్చి థర్డ్ అంపైర్‌ను అడిగాడు. సాధారణంగా టీవీ అంపైర్ వీడియో చూసి బాల్.. బాట్స్‌మెన్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందా? లేదా? అనేది చూసి నిర్ణయం ప్రకటిస్తారు.


ఈ ఐపీఎల్ నుంచి హై ఫుల్ టాస్ నిర్ణయం కోసం హైక్-ఐ ద్వారా బాల్ ట్రాకర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆ టెక్నాలజీ ప్రకారం ఓ యాంగిల్‌లో చూసినపుడు బాల్ రుతురాజ్ నడుము కంటే కొద్దిగా కింద నుంచి వెళ్లినట్టు కనిపించింది. దీంతో రుతురాజ్‌ను అవుట్‌గా ప్రకటించారు. నిజానికి అది అవుట్ కాదని, చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అలాంటి బాల్స్ వచ్చినపుడు వాటిని నో-బాల్స్‌ (No-ball)గానే ప్రకటించారని సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నో బాల్ నిర్ధారణకు బాల్ ట్రాకర్ టెక్నాలజీ ఉపయోగించాలనే చెత్త రూల్ వల్ల రుతురాజ్ సెంచరీ కోల్పోయాడని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2023-04-01T08:30:53+05:30 IST